ఆర్యవైశ్య నాయకులు కన్న కృష్ణ జన్మదిన వేడుకలు

14-11-2026 | 10:39pm

ముకరంపుర, నవంబర్ 14(విజయక్రాంతి): ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు(Prominent Arya Vysya Leaders), నగర కార్పొరేషన్ కో ఆప్షన్స్ సభ్యులు కన్న కృష్ణ 64వ జన్మదిన వేడుకలు కరీంనగర్ నగరంలోని(Karimnagar City) టవర్ సర్కిల్ వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) హాజరయ్యారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పుష్పగుచ్ఛం అందించి కన్న కృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) ప్రారంభించి... స్వయంగా ప్రజలకు అన్నదానం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగల పవన్ కుమార్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కన్న సాయి, వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్, కన్యకా పరమేశ్వరి దేవస్థాన

అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త తోడుపునూరి కరుణాకర్, నవీన్, ఆంజనేయులు, ఇతర ఆర్యవైశ్య సంఘం పెద్దలు, నాయకులు, మిత్ర బృందం, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు