ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో(District Congress Party Office) భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాపర్తి మురళి(Raparti Murali), మార్కెట్ కమిటీ డైరెక్టర్ విశ్వనాథ్, డీసీసీ ఉపాధ్యక్షులు తారిఖ్, భీంరావు, కార్యదర్శి నాంపెల్లి శంకర్, షేక్ కాలీం, షేక్ అజీముద్దీన్, జాడి ప్రసాద్, కనక నాగోరావు, మర్రి బాలు యాదవ్, బట్టుపల్లి కమలాకర్, సిడాం తిరుపతి, కాసయ్య, జాడే ప్రభాకర్, రత్నం ఆనందరావు, సత్రవేణి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.