రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి కనపర్తి కుమారి
అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్...
సత్తుపల్లి, నవంబర్ 14. ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా(Vice President of the Telangana State Mahila Congress) సత్తుపల్లి(Sattupalli) కి చెందిన కనపర్తి కుమారిని రెండవ సారి నియమించారు. ఈనెల 12వ తేదీ హైదరాబాదులోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ(Errabelli Swarna) నేతృత్వంలో జరిగిన సమావేశంలో సత్తుపల్లి కి చెందిన కనపర్తి కుమారికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా గతంలో కాంగ్రెస్ పార్టీ కి ఆమె చేసిన సేవలను గుర్తించి రెండవసారి అవకాశం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కనపర్తి కుమారి మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం నుండి తనను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జాతీయ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అల్కా లాంబా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,రాష్ట్ర మంత్రులు భట్టి,తుమ్మల, పొంగులేటి మరియు ఎమ్మెల్యే దంపతులు మట్టా రాగమయి దయానంద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు సత్తుపల్లిఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సహకారం తో పార్టీ కోసం మరింత కష్టపడి పని చేస్తానన్నారు.