జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

14-11-2026 | 09:52pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఈ నెల 15న నల్లగొండలో నిర్వహించే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల భారీ ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం దినకర్ పిలుపునిచ్చారు. శనివారం ప్రజా సంఘాల కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, కనీస మద్దతు ధర, సాగునీటి సౌకర్యాల కల్పన కోసం రైతాంగం ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గోడిసెల కార్తీక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి. రాజేందర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు