జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
14-11-2026 | 09:51pm
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కోర్టు(Asifabad District Court) ఆవరణలో శనివారం జిల్లా జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం(District Judicial Employees' Association) నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షుడిగా వి. ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షురాలిగా ఇ. లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఎస్. శ్రీదేవి, కోశాధికారిగా కె. రవీందర్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎస్. మశ్చందర్, బి. శ్యామ్ కుమార్, ఎం. ముత్యాలు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎం. కొమురయ్య, ఎ. రాజగోపాల్ వ్యవహరించారు.