ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా
మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్.
జవహర్ నగర్, నవంబర్ 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిది(Chief Minister's Relief Fund) పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పిస్తుందని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా (Reddy Shetty Srinivas Gupta, former Deputy Mayor of Jawahar Nagar)పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బిజేఆర్ నగర్ కు చెందిన పాలకుర్తి శివ కార్తిక్ కు ఇటీవలే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ 60 వేల రూపాయల చెక్కు మంజూర అయింది. శనివారం మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస గుప్తా కార్యాలయంలో బాధితు లైన పాలకుర్తి శివ కార్తిక్ కు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి సహాయనిది పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భరోసా అని చెప్పారు. సహాయం అందడంతో శివ కార్తీక్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి మాజీ డిప్యూటీ మేయర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెట్టు వెంకన్న పాలకుర్తి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.