రోడ్డు సూచికలు, సీసీ కెమెరాలకు ఫ్లెక్సీల అడ్డు..!

07-10-2026 | 05:25am
  1. పట్టణ ఆదాయానికి గండి..పట్టింపు నిల్ 
  2. రోడ్డు భద్రత గాలికి... అధికారులు తిరిగిన పట్టింపులేదంట 
  3. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు

జడ్చర్ల, అక్టోబర్ 6:  మున్సిపాలిటీ పరిధిలో ప్రజల భద్రత కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యాధునిక సీసీ కెమెరాలను(CCTV cameras) ఏర్పాటు చేసింది. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు(Thefts, road accidents), అసాంఘిక కార్యకలాపాలను గుర్తించడానికి ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని భావించారు. కానీ పట్టణంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉం ది.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మున్సిపల్ కార్యాలయం(Municipal Office) పరిసరాలు, బస్టాండ్ రోడ్డు, హౌసింగ్ బోర్డు ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పోల్స్ నే ఇప్పుడు ప్రైవేటు ప్రకటనల స్తంభాలుగా మార్చేశారు.

కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకుల అనుచరులు తమ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏకంగా కెమెరాలకు అడ్డుగా కట్టేస్తున్నారు.ఫలితంగా కెమెరా కళ్లు మూసుకుపోయాయి. కెమెరా ముందు ఫ్లెక్సీ ఉం డటంతో రోడ్డుపై ఏం జరుగుతుందో కంట్రోల్ రూంలో తెలియడం లేదు. ఒకవేళ ప్రమా దం జరిగినా, దొంగతనం జరిగినా సాక్ష్యం దొరికే పరిస్థితి లేదు. వాహనదారులకు దారి చూపే రోడ్డు సూచిక బోర్డులు కూడా ఫ్లెక్సీల చాటున మాయమవుతున్నాయి. బయటి నుంచి వచ్చే వారికి ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుం దో తెలియక తికమక పడుతున్నారు. రాత్రి వేళల్లో ఇది ప్రమాదాలకు దారి తీస్తోంది.

అనుమతి లేకున్నా.. దర్జాగా ప్రచారం బోర్డులు 

మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థను కాపాడాలంటే అక్రమ ఫ్లెక్సీలపై కొరడా ఝళిపించాల్సిందేనని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జడ్చర్ల మున్సిపల్ కమిషనర్, పోలీస్ శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకొని, సీసీ కెమెరాలకు, సూచిక బోర్డులకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి, అక్రమంగా ఫ్లెక్సీలు కట్టే వారిపై జరిమానా విధించాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు తీసుకోవాల్సిందే 

అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పరిశీలన చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అదేవిధంగా సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సూచిక బోర్డులు, రహదారి భద్రతకు ఆటంకం కలిగించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం.ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు గుర్తిస్తే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఎం గీరిష్, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల 

మరిన్ని వార్తలు