గ్రంథాలయాలు విశ్వవ్యాప్త విజ్ఞాన భాండాగారలు

14-11-2026 | 10:04pm

మహబూబాబాద్,(విజయక్రాంతి): గ్రంథాలయాలు విశ్వవ్యాప్త విజ్ఞాన భాండాగారాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల(National Library Week Celebrations) సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి(Library Chairman Vennam Srikanth Reddy), చదువుల తల్లి సరస్వతి దేవి, చాచా నెహ్రు , గ్రంథాలయ పితామహుడు ఎస్, ఆర్, రంగనాథన్, చిత్రపటాలకు, పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన ,చేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు చదివే ప్రదేశాలు మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సామాజిక స్పృహను పెంపొందించే విజ్ఞాన కేంద్రాలన్నారు. నేటి డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని, ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తూర్పాటి శ్రీలత, లైబ్రేరియన్స్, జీ.విజేందర్, రుద్రారపు వీరేందర్, మహబూబాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు లయన్ బొడ్డుపల్లి ఉపేంద్రం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు