బాలల దినోత్సవ వేడుకలు
14-11-2026 | 09:53pm
రాజాపూర్ నవంబర్ 14 : మండలంలోని రాయపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో శనివారం బాలల దినోత్సవం వేడుకలు(Children's Day Celebrations) ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.బాలబాలికలకు ఆరోగ్యం విద్య పరిశుభ్రత గురించి వివరించారు.బాల బాలికలకు నోట్ బుక్స్ పెన్సిల్ స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు శివకుమార్ గౌడ్, మల్లేష్, గ్రామ కార్యదర్శి సుదర్శన్,నర్సింలు,వెంకటయ్య గౌడ్, యాదయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.