కాసిపేట 1 గని ని సందర్శించిన అసిఫాబాద్ డి ఎఫ్ ఓ

16-11-2026 | 06:55pm

కాసిపేట/బెల్లంపల్లి: కాసిపేట 1 ఇంక్లైన్ గనినీ(Kasipet 1 Incline Mine) ఆసిఫాబాద్ ఐ ఎఫ్ ఎస్ సి హెచ్ బాలమణి(IFSCH Balamani) సోమవారం సందర్శించారు.  సందర్శించడానికి వచ్చిన ఆమెను గని మేనేజర్ సతీష్,అధికారులు స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు.గని లో ఉన్న పర్యావరణాన్ని చూసీ సంతృప్తిని  వ్యక్తం చేశారు. గని పరిసరాలు పచ్చని చెట్లు,

అప్లదకరమైన వాతవరం, చూపరులను ఆకర్షించే వణ్యపాణుల చిత్రాలు బాగున్నాయని అని ప్రశంసించారు. ఉద్యోగులతో మాట్లాడి వారి బాగోగులను, పని విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనిచేస్తున్న గని పని స్థలాలలు పరిశీలించి, ఉద్యోగుల పని విధానాన్ని,బొగ్గు ఉత్పత్తి ని,యంత్రాల పనితీరును ఆస్తితో తెలుసుకున్నారు.

సింగరేణి ఉద్యోగులు కష్ట పడి పనిచేసేవారని,చీకట్లను తొలగించి దేశానికి వెలుగులు పంచేవారని, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయగల నేర్పరులు సింగరేణి కార్మికులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ సతీష్,రక్షణాధికారి సురేష్,సర్వేయర్ రవీందర్,సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు