జాతీయస్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

16-11-2026 | 05:55pm

మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీల(National Level Softball Competition)కు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 19 పాఠశాల క్రీడా సమైక్య (ఎస్ జీ ఎఫ్) కార్యదర్శి బీ బాబురావు తెలిపారు. ఈ నెల 6 నుంచి 9 వరకు హైదరాబాద్ లోని అరబిందో భగవాన్ లో జరిగిన 70వ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుందని, ఈ జట్టులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బి వినయ్ (సి ఓ ఈ బెల్లంపల్లి), ఆర్ ప్రణవ్, పి రాహుల్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆసిఫాబాద్), బాలికల విభాగంలో సిహెచ్ విశ్వవేధ (ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, ఆదిలాబాద్)లు ఎంపిక కాగా వీరు ఈ నెల 18 నుంచి 22 వరకు జార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులను మంచిర్యాల డిఐఈఓ మదార్ గౌడ్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఆర్ జెడ్ ఓ శారద, పీడీలు, పీఈటీలు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్, కోట యాదగిరి, తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు