స్మార్ట్ రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

16-11-2026 | 06:16pm

లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చర్ల, నవంబర్ 16: (విజయక్రాంతి): చర్ల మండల కేంద్రంలో రాహుల్ విజ్ఞాన్ స్కూల్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ లో స్మార్ట్ రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు(MLA Tellam Venkat Rao) ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వాగ్దానం చేశారు. మండల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు