పింఛన్ల మంజూరు పత్రాల అందజేత

16-11-2026 | 06:18pm

బెజ్జంకి,విజయక్రాంతి: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ(MLA Kavvampelli Satyannarayana)  చేయూత పింఛన్ల(Cheyutha Pensions) మంజూరు పత్రాల కార్యక్రమం ప్రారంభించిన  అనంతరం మండలంలోని గూడెం గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు