సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాతీయ స్థాయి ఫార్మసీ సదస్సు

14-11-2026 | 09:51pm

ఘట్‌కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ డివిజన్ పరిధి కొండాపూర్‌లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ(Samsukthi College of Pharmacy) ఆధ్వర్యంలో నవంబర్ 13, 14 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఫార్మసీ సదస్సు నేషనల్ కాన్ఫరెన్స్ ఫార్మేక్స్ 2026(National Conference Pharmex 2026) ఘనంగా ముగిసింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ఫార్మసీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈసదస్సులో ఔషధ పరిశోధన, అభివృద్ధి, తయారీ, ఫార్మసీ ప్రాక్టీస్, రోగుల ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు వినియోగం, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్తు అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈసందర్భంగా ముఖ్య వక్తలుగా డాక్టర్ పి. విజయలక్ష్మి, అసోసియేట్ డైరెక్టర్, రెగ్యులేటరీ అఫైర్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ భానుప్రకాష్ కోటమర్తి, విశ్రాంత చీఫ్ సైంటిస్ట్, డాక్టర్ వీరారెడ్డి ప్రభాకర్ రెడ్డి, హెడ్, పాలమూరు విశ్వవిద్యాలయం సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు.

ఈకార్యక్రమంలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్  ఏ.వి. రమణారెడ్డి, సెక్రటరీ ఎం. రాజేంద్ర కృష్ణ, సెక్రటరీ ఎ. చరితా రెడ్డి, హవీష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్, సెయింట్ విన్సెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ,  అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. శివ కేశవరెడ్డి,  టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. జానకి రాములు, ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. స్వాతితో పాటు విభాగాధిపతులు వి. ఉమారాణి, పి. మునిజ, పి. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు