అనురాగ్ లో ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరం
ఘట్ కేసర్, నవంబర్ 14 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలో(Anurag University) నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం(National Service Scheme) (ఎన్ఎస్ఎస్) ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరం(Pre-Republic Day Parade Camp) ఐదవ రోజు క్రమశిక్షణ, సాంస్కృతిక వైవిధ్యం(Discipline, cultural diversity), జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతల సమ్మేళనంగా ఉత్సాహభరితంగా సాగింది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి శిబిరానికి హాజరైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు(NSS Volunteers) ఉదయం పరేడ్ సాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పరేడ్ శిక్షకుల మార్గదర్శకత్వంలో మార్చింగ్, డ్రిల్ కదలికలు, సమన్వయం, సమయపాలన, క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక సాధన చేశారు. రాబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్లో(Republic Day Parade) అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తున్నారు.
ఐదవ రోజు ప్రత్యేక ఆకర్షణగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమ తమ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు, సంగీతం, సాంప్రదాయ వస్త్రధారణను ప్రతిబింబించే అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో రీజినల్ డైరెక్టర్ క్యాంప్ డైరెక్టర్ ఆర్. సైదా, అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేష్, ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన కంటింజెంట్ లీడర్లు, ఎన్ఎస్ఎస్ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.