తల్లిదండ్రులు, గురువుల గొప్పదనం చాటే సినిమా
మాస్టర్ జయంత్ బొలిశెట్టి(Master Jayanth Bolisetti), ‘మన శంకర వర ప్రసాద్’ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేశ్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి ముఖ్య పాత్రలను పోషిస్తున్న సినిమా ‘జయంత్ అండ్ ది జింగో పెన్(Jayanth and the Jingo Pen)’. దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్నారు. దర్శకుడు నవీన్ దేశబోయిన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. చిల్డ్రన్స్ డే స్పెషల్గా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్వహిం చిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “దివ్యప్రవీణ్ నాకు ఈ సినిమా గురించి ముందే చెప్పారు. చాలా బాగుంది. హిందీలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రంలా తెలుగులో ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటుంది.
పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ తప్పక చూడాల్సిన సినిమా” అన్నారు. డైరెక్టర్ నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. “జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కళాత్మక సినిమాల్ని ప్రజలు ఆదరించాలి. ఇలాంటి చిత్రాల్ని చూసినప్పుడు ఎంతో మంచిని గ్రహించొచ్చు” అన్నారు. ‘తల్లిదం డ్రులు, స్టూడెంట్స్ సాధించే మార్కుల కంటే వారి మనసుల్ని అర్థం చేసుకోవాలని ఈ సినిమా తీశామ’ని నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి చెప్పారు. ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. “అమ్మా, నాన్న, గురువు గొప్పదనం చాటి చెప్పేలా ఈ చిత్రం ఉంటుంది” అని తెలిపారు. బేబీ ఊహా రెడ్డి, మాస్టర్ జయంత్, సహ నిర్మాత షఫీ, నటీనటులు ఆశిష్ గాంధీ, సత్యం రాజేశ్, మానిక్ రెడ్డి, కాశీ విశ్వనాథ్ తదితర చిత్రబృందం కూడా ఈ వేడుకలో మాట్లాడారు.