నా కొడుకు నుంచి అలాంటి ప్రశ్నల్ని ఊహించలేకపోయా!

01-11-2026 | 05:05am

రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) ‘రామాయణ’లో రావణుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక రెండు భాగాల ఇతిహాస చిత్రానికి మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని యశ్ పంచుకున్నారు. తాను రాముడి పాత్రలో కాకుండా రావణుడి పాత్రలో ఎందుకు నటిస్తున్నానో తన చిన్న కొడుకుకు వివరించాల్సి వచ్చిందని చెప్పారు.

‘రామాయణ’ కథ గురించి తెలుసుకున్న తర్వాత తన కొడుకు ఎలా స్పందించాడో చెబుతూ యశ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన తండ్రి రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుసుకున్న చిన్నారి మొదట ఆశ్చర్యపోయాడట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ యశ్ మాట్లాడుతూ.. “నా కొడుకుకు తన తండ్రి ఎవరో తెలుసు. కానీ ఇప్పుడు రామాయణ కథ గురించి తెలుసుకు న్నాక ఆశ్చర్య పోయాడు.  కథను ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవా లంటే మనం మొత్తం కథను తెరపై చూపించాలని తనకు వివరించాను.

నటుడికి, అతను పోషించే పాత్రకు మధ్య ఉన్న తేడాను పిల్లలకు అర్థమ య్యేలా చెప్పడం ఒక సవాలుతో కూడుకున్న విషయం. ఈ కథ లోని అంతరార్థాన్ని, ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి రాముడేననే విషయా న్ని నా కొడుకుకు వివరిం చాల్సి వచ్చింది. ఈ కథలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రధాన వ్యక్తి శ్రీరాముడు. అందరూ రాముడి మార్గంలో నడవాలి. రావణుడు గొప్పగా, శక్తిమం తం గా, గంభీ రంగా కనిపించ వచ్చు. కానీ, జీవితంలో నిజమైన, శాశ్వత  

విజయం రావాలంటే రాముడి ధర్మాన్ని మనం ఆచరిం చాలి. ‘థియే టర్లో నటుడిగా నువ్వు నన్ను చూసి చప్పట్లు కొట్ట వచ్చు. కానీ నేను పోషిస్తున్న పాత్రనే ఆదర్శంగా భావించకూడదు’ అని తనకు చెప్పాను” అని యశ్ వెల్లడించారు. అయితే, కథ చివర్లో రావణుడు ఓడిపోయి చనిపోతాడా అని కూడా యశ్ కొడుకు అడిగాడట. ఆ సంద ర్భాన్ని గుర్తుచేసుకుంటూ యశ్ మాట్లా డుతూ.. “చివర్లో నువ్వు చనిపో తావా? ఓడిపోతావా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టంగా అనిపించింది.

ఈ ప్రాజెక్టుకు సంతకం చేసినప్పుడు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన నటనను అందించాలని మాత్రమే ఆలోచించాను. కానీ నా కొడుకు నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతా యని ఊహించలేదు. నటుడికి, అతను పోషించే పాత్రకు మధ్య ఉన్న తేడాను తనకు వివరించడం ఒక ప్రత్యేకమైన అనుభవం” అని చెప్పారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ను నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాసంలోని తొలి భాగం 2026 నవంబర్ 5న విడుదల కానుంది. 


మరిన్ని వార్తలు