అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్ తనిఖీ

20-11-2026 | 12:35am

చిన్నారులు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా

హత్నూర: హత్నూర గ్రామంలోని రెండో అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నల్లోల్ల ఎల్లయ్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులకు గుడ్లు, భోజనం అందిస్తున్న తీరుతో పాటు వారి హాజరు, విద్యాబోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పరిధిలోని గర్భిణుల సంఖ్య, వారికి ప్రతినెలా గుడ్లు, పాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చెక్క మానస రవీందర్ గౌడ్, 13వ వార్డు సభ్యుడు నగేష్, పంచాయతీ కార్యదర్శి, బాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు