యలహంక నా బిడ్డల హక్కే

01-11-2026 | 05:00am
  1. కూతురు ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్నా
  2. నవ దంపతులకు అందరి ఆశీస్సులుండాలి
  3. పెళ్లి విషయంలో స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

అమరావతి, అక్టోబర్ 31: ఆస్తుల పంపకాల్లో భాగంగా యలహంక పూర్తిగా తనకు, తన పిల్లలకు దక్కిందని దేవుడి సాక్షిగా ఇదే నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(AP Congress President YS Sharmila) అన్నారు. తన  తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్న, తిరిగిన ఇల్లు కావడంతో తన కుమార్తె అంజలి వివాహం అక్కడే జరపాలని అనుకున్నానని కాని కుమార్తె  ఆకాంక్షను నెరవేర్చలేకపోయానని షర్మిల తన బాధను వ్యక్తం చేశారు. అంజలిరెడ్డి  వివాహం, వేదిక మార్పుపై షర్మిల శనివారం ఎక్స్‌లో స్పందించారు.

సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమన్నారు. కానీ తన విషయంలో అలా జరగడం లేదని వాపోయారు. తన కుమార్తె వివాహం ఎలాంటి గొడవలు లేకుండా వివాద రహితంగా జరిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే అంజలిరెడ్డి, సోమల రఘురామ్‌రెడ్డిల పరిణయ వేదికను ఇతర ప్రదేశంలో నిర్వహించాలని నిశ్చయించామన్నారు. నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. వివాహ వేదికపై గత కొన్ని రోజులుగా వస్తున్న వరుస కథనాలు చూసి తన బిడ్డ గురించి బాధపడ్డ ప్రతీ ఒక్కరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని వార్తలు