26-11-2025 12:00:00 AM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి, నవంబర్ 25 (విజయక్రాంతి): గొర్రెల కాపరి సుధాకర్ కుటుంబాన్ని మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. సుధాకర్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల కాపరి సుధాకర్ మృతి చెందడం చాలా దురదృష్టకరమని అన్నారు.
వారి కుటుంబానికి పిల్లలు చదువుకోవడానికి రూ.20,000 రూపాయలు అందజేసి నా వంతు సహాయ సహకారాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల అంజయ్య, నిమ్మ విజయకుమార్ రెడ్డి, వీరన్న పటేల్, తాజా మాజీ కౌన్సిలర్లు ఊరు దొండ రవి, చాట్ల వంశీ, పంపరిశ్రీనివాస్, శంకర్రావు, పిడుగు మమత సాయిబాబా, గడ్డమీది మహేష్, మామిండ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్, నవీన్, యూత్ నాయకులు ఆబిద్, ఇమ్రాన్, బల్ల శ్రీనివాస్, కిరణ్, మున్నా, శశి, గౌస్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.