26-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, నవంబర్ 25 (విజయక్రాంతి) : గత నాయకుడు చేసిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే సంబందించిన ఏసిబి శాఖల నోటీసులో ఉందని వాళ్ళ పని వాళ్లు చేసుకుంటూ పోతారని ఇక్కడి బిఆర్ఎస్ నాయకులకు వాళ్ళ నాయకుడిని జైలుకు పంపాలని ఉత్సహపడుతున్నారని మీ కోరిక మేరకు మీ నాయకుడిని జైలుకు పంపుతా మని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లో ఉదయం నుండి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్యవ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 2 వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రం లో సి ఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల కోసం హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా అన్ని పనులకు సంబందించిన టెండర్లు పూర్తి కావడం జరిగిందన్నారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో మినీ ట్యాంక్ బండ్ లో గతంలో ఒక మినీ ఓపెన్ జిమ్ ప్రారంభీంచడం జరిగిందని ప్రజల కోరిక మేరకు మరో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు చెరువులో బోటింగ్ సైతం ఏర్పాటు చేయనున్నమన్నారు.
గ్రామాలకు సంబందించిన అన్ని వసతులు పూర్తి చేసుకున్నామన్నారు. సి ఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం లో తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినకుండా మహిళలకి చీరలు పంపిణి చేస్తున్నామన్నారు. వనపర్తి నియోజకవర్గం లో గతంలో జరిగిన అవీనీతి అక్రమాల గురించి పలు సందర్భలో చెప్పడం జరిగిందని ఆ విషయం లో వనపర్తి లో ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు.
హైదరాబాద్ లో వాళ్లు వనపర్తి లో ఈయన దోచుకున్నారని చాలా మంది మీద కేసులు పెట్టించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సోమవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ లో పాత కొత్త నాయకులు అని మాట్లాడు తున్నారని మా ఇంటి సమస్య గురించి అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.