calender_icon.png 12 July, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుల్జార్ హౌస్ బాధితులకు 85 లక్షల పరిహారం

12-07-2025 02:05:19 AM

  1. సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిధులు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 11 (విజయ క్రాంతి): హైదరాబాద్లోని చార్మినార్ గుల్జార్ హౌస్లో గత మే నెలలో యావత్ నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘోర అగ్ని ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 17 మంది కుటుంబాలకు నష్టపరి హారంగా మొత్తం రూ.85 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి  నుంచి నిధులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ ఘటన, శ్రీ కృష్ణ పెరల్స్ యజమాని ప్రహ్లాద్ మోడీ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 21 మందిలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, 17 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహా రం ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటించి, బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చింది.