calender_icon.png 24 July, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలి

23-07-2025 07:40:11 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహిళాల ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా  తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ  బస్సుల్లో మహిళలు ఎల్లిపాయలు  వలుస్తున్నారని, కుట్లు కుట్టుకుంటున్నారని, కేటిఆర్ మహిళలను కించపరిచి, ఆటబొమ్మలుగా చులకన చేసి మాట్లాడారని  ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధ్యం అవుతున్నాయన్నారు.  సుమారు రూ 6700 కోట్ల మహిళలకు ఆదా జరిగిందని , ఒక్క సంవత్సరంలోనే 48 కొత్త బస్సులు మన మహబూబ్ నగర్ కు కేటాయించడం జరిగిందన్నారు.

వచ్చే సంవత్సరం లోగా మళ్ళీ 48 కొత్త బస్సులు అందుబాటులొకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.  ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన వెంటనే బిఆర్ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉండటం తో  మహిళలను అవహేళన చేస్తూ మాట్లాడారని చెప్పారు.  కానీ ప్రజా ప్రభుత్వ మహిళలు ద్వారానే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలోకి ఎదుగుతుందని గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల నుంచి కూడా అధికారులు వచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం గురించి అధ్యయనం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఈసందర్భంగా ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాఘవి , భాగ్యలక్ష్మి, శిరిషా, అయేషా బేగం, ప్రవళిక లకు బహుమతులు ప్రదానం చేశారు.    నిత్యం ప్రయాణం చేసే ప్రయాణం చేసే మహిళలు లక్ష్మమ్మ , ప్రభుత్వ ఉపాధ్యాయులు రమాదేవి, విజయ లను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు.  అనంతరం బస్సు స్టేషన్ లో ఉన్న పఠన మందిరాన్ని సందర్శించి, సందర్శకుల రిజిస్టర్ లో సంతకం చేశారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహార్, నాయకులు అజ్మత్ అలి, ఖాజా పాషా, అంజద్, రాషెద్ ఖాన్, సంజీవరెడ్డి ఆర్టీసీ ఆర్ఎం కవిత, డిప్యూటీ ఆర్ఎం లక్ష్మి ధర్మా, డిఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.