మహేష్ న్యూలుక్ ఇదేనా..!

24-04-2024 12:15:00 AM

‘గుంటూరుకారం’ తరువాత కథానాయకుడు మహేష్‌బాబు నటిస్తున్న ఏ చిత్రం సెట్స్ మీద లేదు. అయితే మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే తదుపరి చిత్రం గురించి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన గెటప్ కోసం హెయిర్, ఫిజిక్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసుకుంటున్నాడు మహేష్. అందుకే మహేష్‌ను ఈ మధ్య అభిమానులు ఎక్కడ చూసిన రాజమౌళి చిత్రంలో గెటప్ ఇదేనా అంటూ ఊహించుకుం టున్నారు. ఇప్పుడు అదే కోవలో మరో సారి మహేష్ లుక్ గురించి చర్చ మొదలైంది.

ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఐపీఎల్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘మహేష్‌బాబును కలవడం ఆనందంగా వుంది’ అంటూ మహేష్‌తో దిగిన ఓ ఫోటోతో  పోస్ట్ పెట్టారు. ‘మిమ్మల్ని కలవ డాన్ని గౌరవంగా భావిస్తున్నా. మీకు పెద్ద అభిమానిని’ అంటూ మహేష్ కూడ ఆ ట్వీట్‌కు స్పందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఫోటోలో మహేష్ లాంగ్ హెయిర్‌తో, మ్యాన్లీ లుక్‌తో కనిపించే సరికి అభిమానులు మా అభిమాన హీరో న్యూలుక్ ఇదే.. వావ్ అదిరిపోయాడు అంటూ కామెంట్స్ మొదలుపెట్టారు..!