16-09-2025 01:12:31 AM
-‘విమోచన’ మన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం
-మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు
-“సెప్టెంబర్ 17 విమోచనే”ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరి స్తున్నాయని,తెలంగాణ విమోచన అనేది మన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండి కూడా మరుగున పడటం సమంజసం కాదని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్‌రావు పేర్కొన్నారు. సోమవారం భాస్కర యోగి రచించిన “సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనే” పుస్తకాన్ని మాజీ గవర్నర్ ఆవిష్కరించారు.
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ... 1998లో సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఉద్యమాన్ని ప్రారంభించుకున్నట్లు ఆయన తెలిపారు. 17 సెప్టెంబరు విమోచన దినం ప్రాముఖ్యతను పిల్లల పాఠ్యాంశాల్లో చేర్చాలని, కోమరం భీం, షోయబుల్లా ఖాన్ వంటి అనేకమంది మహనీయుల విగ్రహాలు హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠించాలనే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగిందన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధికారికంగా ఆవి ష్కరించనున్నారని తెలిపారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్‌రావు పాల్గొన్నారు.