16-09-2025 01:13:37 AM
తెలంగాణ రాష్ర్ట పోలీస్ నిరుద్యోగ జేఏసీ
ఖైరతాబాద్ సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ర్ట పోలీస్ నిరు ద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ సభ్యులు నవీన్ పట్నాయక్, ఆకాష్ గౌడ్, శంకర్, శింబు నాయక్, వంశీ, లోకేశ్, సాయి, రఘు, నరేష్, మహేష్ తదితరులు హాజరై మాట్లాడారు..
గత ప్రభుత్వం 2022 వ సంవత్సరంలో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం బాధాకరమని అన్నారు.నాటి నోటిఫికేషన్‌లో జీవో నంబర్ 46 ద్వారా చాలా మంది తెలంగాణ లోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర వ్యక్తి బోర్డు చైర్మన్‌గా ఉండడమే అని అన్నారు.
నాడు హైకోర్టులో స్టే ఉండగా ఫలితాలను విడుదల విడుదల చేసి నియామకాలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులే ఈ ప్రభుత్వంలో కూడా ఆయన చేస్తున్నారని, తక్షణమే 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి జీవో 46 మినహాయించాలని, అరత వయసు 35 కు పెంచడమే కాకుండా,స్థానికతను ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన ఆధారంగా పరిగణించి నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.