calender_icon.png 16 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో చేరిన భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ రావు

15-12-2025 01:32:32 AM

గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 

టేకులపల్లి, డిసెంబర్ 14, (విజయక్రాంతి): తన 40 సంవత్సరాల పార్టీని కాం గ్రెస్ పార్టీని కాదనుకొని అక్కడ జరిగే అక్రమాలను, దౌర్జన్యాలను ఎదిరించి ఆ పార్టీ పరిస్థితి బాలేదని తెలుసుకొని కచ్చితంగా తె లంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో అభివృద్ధి చేసినటు వంటి కేసీఆర్ ని దృష్టి లో పెట్టుకొని కేటీఆర్ ఆదేశాలతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూక్యా దళ్ సింగ్ నా యక్, బేతంపూడి పీఏసిఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు లను బీఆర్ ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

టేకులపల్లి మం డలం దాసుతండ గ్రామంలోని మాజీ ఎమ్మె ల్యే బానోత్ హరిప్రియ గృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించా రు. కొత్తగా పార్టీలో జాయిన్ అయినా నా యకులతో కలిసి 17 న జరిగే ఎన్నికల కోసం రెండు మండలాల్లో తిరిగి అత్యధిక సీట్లు గెలిపించాలని కోరారు. కార్యకర్తలు కూడా ఉ త్సాహంగా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో కూ డా ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో అత్యధిక సీట్లు తెచ్చుకుంటామన్నారు.

రాబోయే ఎంపీటీసీలు, జ డ్పీటీసీలు కాకుండా అసెంబ్లీ ఎన్నికలు వ చ్చినా కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని తెలిపారు. అందరు సంసిద్ధంగా ఉండాలి పోరాటం కొత్త కాదని టిఆర్‌ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు. దాదాపు ఎన్నో ఎలక్షన్లు ఎదుర్కొన్నటువం టి పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నో పదవులు కూ డా త్యాగం చేసినటువంటి పార్టీ కేసీఆర్ ఎన్నో పదవులు త్యాగం చేసి కొట్లాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణని మంచిగా బంగా రు తెలంగాణగా చేసుకొని దాదాపు 50 ఏ ళ్లు నుంచి చూసాము స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 ఏళ్ల పాలన కూడా చూసామన్నారు.

కేసీఆర్ చేసిన పదేళ్ల పాలన కూడా చూశాం 65 ఏళ్లలో చేయని అభివృద్ధి మొ త్తం కేవలం 10 ఏళ్లలో చేసిన ఘనత ఉందన్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో హరిప్రియ ఉన్నటువంటి 2018 నుంచి 23 వరకు అసెంబ్లీలో కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధి చేస్తే, ఇప్పుడున్న ఎమ్మెల్యే టైం పాస్ చేయడం వాళ్ళ తమ్ములతోని కూర్చొని వాళ్ళ తమ్ములను పెట్టి బెదిరించడం దౌర్జన్యం చేయడం తప్ప అభివృద్ధికి అస్సలు చాన్సే ఇవ్వడంలేదన్నారు. కేవలం దౌర్జన్యాన్ని నమ్ముకొని పోలీసులను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

ఇక్కడ పోలీసులు అవసరమా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి నామినేషన్ దగ్గర ఎలక్షన్ జరుగుతుంటే కూడా కొట్టడం జరిగిందని, పై అధికారులతో మాట్లాడడం జరిగిందని, వెంటనే ఎస్పీ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. లక్కినేని సురేందర్ రావు మీద ఆరోజు ఏమి జరిగిందో అందరికి తెలుసన్నారు. పోలీసులు ఖాకీ డ్రెస్సులు తీసేసి కాంగ్రెస్ డ్రెస్ వేసుకొని డ్యూటీలు చేస్తున్నట్టు కనబడుతున్నారన్నారు. ఎందుకంటే వార్డ్ మెంబర్లను విత్ డ్రా చేయించ డం, బెదిరించడం, సర్పంచ్లను బెదిరించడం గెలవాలి కచ్చితంగా కాంగ్రెస్ అని చెప్పేసి బీఆర్‌ఎస్ కార్యకర్తలని, నాయకులు బెదిరించి కేసులు పెడతామని చెప్పి బెదిరిం చడం ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కరెక్ట్ కాదు తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా కాంగ్రెస్ సంస్కృతి ఇదేవిధంగా నడుస్తుందని, ఈ అదిరింపులు, బెదిరింపులతోని ఎంత కాలం నడవదన్నారు. బీఆర్ ఎస్ నాయకులు చాలా స్థిరంగా గట్టి నమ్మకంతో కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి సీఎంగా తెచ్చుకోవాలన్నా సంకల్పంతో ఉన్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరి సొత్తు కాదన్నారు. ఇంకొక ఆరు నెలల్లో మీ పరిస్థితులు కూడా అర్థమైతే రాష్ట్రం ఎటువైపు ప్రయాణిస్తుందని తెలుస్తుందన్నారు. 

న్యాయంగా ఉండాలి, సమానంగా డ్యూటీ చేయాలని సమానత్వం చూపెట్టాలి తప్ప పార్షాల్టి చూపించాలన్నారు. అధికారంలో ఉన్నామని, ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులు వారి పార్టీ కార్యకర్తలు మీరు ఉన్నారన్న ధైర్యంతోనే కొట్టాడ న్నారు. మీరిచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం బీసీలకు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా అన్యా యం అన్నారు. 17 న జరిగే ఎన్నికల్లో గెలిచే సర్పంచులను, పార్టీలో చేరిన వారిని కెసిఆర్ వద్దకు తీసుకెళ్లి సత్కరించడం జరుగుతుందన్నారు.

అనంతరం దాసుతండ, టేకులపల్లి పంచాయతీలలో ప్రచారం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బొమ్మెర్ల వరప్ర సాద్, బానోత్ హరిసింగ్, బానోత్ రామ, జాలాది అప్పారావు, బానోత్ కిషన్, ఆమెడ రేణుక, బానోత్ రవి, బానోత్ కృష్ణ, పూజారి వెంకట్, భూక్యా లాలూ నాయక్, సిలివేరు సత్యనారాయణ, రంగనాథ్, పూనెం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.