calender_icon.png 22 December, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకోండి.!

22-12-2025 01:02:53 PM

సంపూర్ణ సహకారం అందిస్తా.

స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు(Village Sarpanches), ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మండలంలోని  శ్రీపురం గ్రామంలో కూచుకుళ్ళ గీత నర్సింహా రెడ్డి సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి(Kuchkulla Rajesh Reddy) పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులతో పాటు తన స్వంత నిధులు కూడా సమకూర్చి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందుండాలని ఆకాంక్షించారు.