calender_icon.png 22 December, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణ ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం

22-12-2025 01:14:07 AM

ఎంపీ వైద్య శిబిరం సక్సెస్ 

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ 

మహబూబాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అమోఘమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంపీ పోరిక బలరాం నాయక్ ట్రస్ట్, పలు కార్పొరేట్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పల్నాలజీ, గ్యాస్ట్రో, కార్డియాలజీ, అర్థోమాలజీ, ఈ ఎన్ టి, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనాలజీ, ఆప్తమలజీ, ఈసీజీ, 2డీ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దేశంలో ఏ ఎంపీ చెయ్యని విధంగా పేద ప్రజల ఆరోగ్య కోసం మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయం అని కొనియాడారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఉపిరి ఉన్నంత వరకు మానుకోట పార్లమెంట్ ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. వైద్య శిబిరంతో పాటుగా తమ పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు తమ వంతుగా సేవలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవరెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, గొల్లపల్లి ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ హెచ్.వెంకటేశ్వర్లు, మాధవపెద్ది అమరేందర్ రెడ్డి, నిర్వాహకులు వంశీ నాయక్, రియాజ్ అన్సారీ,అరుణ్ నాయక్, షేక్ ముజ్జు, వినయ్, ప్రముఖ డాక్టర్ సాంబశివరావు, గ్లెనీగల్స్ హాస్పిటల్ డాక్టర్లు మురళీధర్, సాకేత్, చందన్ కుమార్, సతీష్, ఓబుల్ రెడ్డి, మౌనిక, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సింధూజ, సనత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.