01-11-2025 12:45:52 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో శుక్రవారం అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రారంభమైన ప్రమాణస్వీకారం కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లోనే ముగిసింది.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, సీఎస్ రామ కృష్ణారా వు, డీజీపీ శివధర్‌రెడ్డి హాజరయ్యా రు. అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం , మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడంతో, సీఎం రేవంత్‌రెడ్డితో కలిపి మొత్తం క్యాబినెట్ 16కు చేరుకున్నది. ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: అజార్
నాకు మంత్రి పదవి ఇవ్వడంపై కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మంత్రి పదవికి.. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధం లేదని మంత్రి అజారుద్దీన్ అన్నారు. గత కొంత కాలంగా తనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ‘నా దేశ భక్తి గురిం చి ఆరోపణలు చేస్తున్నారు. కిషన్‌రెడ్డికి నాపై పూర్తి అవగాహన లేదు.
నాపై కేసులున్నాయంటున్నారు.. అవి ఎక్కడా నిరూ పితం కాలేదు. అందుకు ఎవరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు’ అని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడే తన తక్షణ కర్తవ్యమని అన్నారు. క్యాబినెట్‌లో చోటు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
తనకు ఏ శాఖ ఇచ్చినా నిబద్దతతో పనిచేస్తానని, ఏ శాఖ ఇవ్వాలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యుల ఎదుట మంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్ఠానానికి అజారుద్దీన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.