16-08-2025 12:55:41 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు
మేడ్చల్, ఆగస్టు 15(విజయ క్రాంతి): రా ష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు (పబ్లిక్ అఫైర్స్) కే కేశవరావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన 79 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెం టు సభ్యుడు ఈటెల రాజేందర్, కలెక్టర్ మన చౌదరి, అదనపు కలెక్టర్లు రాధిక గుప్త, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షే మ పథకాలు మేడ్చల్ జిల్లాలో అర్హులైన వా రందరికీ అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యం నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకెళ్తోంది అన్నారు. పారదర్శకమైన పాలన అందించాలని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజా పాలనకు రూపకల్పన చేసిందని అన్నారు. అభివృద్ధి, సంక్షే మ పథకాల ఫలాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు నిరంతరం శ్రమిస్తోందన్నారు.
గృహజ్యోతి, రేషన్ కార్డుల పంపిణీ తో పాటు లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తుందని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమి స్తోందని, బస్తీ ధవఖానాలు ఏర్పాటు చేసి ని రంతరం వైద్య సేవలను అందిస్తుందన్నారు. వసతి గృహాలలో అన్ని మౌలిక వసతులు కల్పనకు పాటు పడుతోందని, బుక్స్, యూ నిఫారాలు సరఫరా చేస్తోందన్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అ మలు తీరును ఆయన వివరించారు. ఈ సం దర్భంగా స్వాతంత్ర సమరయోధురాలు జా నాబాయిని ప్రభుత్వ సలహాదారు కేశవరావు, కలెక్టర్ మను చౌదరి, డీసీపీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు.
ప్రశంసా పత్రాల పంపిణీ
జిల్లాలో ఉద్యోగ ధర్మంలో ఉత్తమ సేవ లు అందించిన అధికారులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్, కీసర, జడ్పీహెచ్‌ఎస్ మేడిపల్లి, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ మేడిపల్లి, ఎస్సీ వెల్ఫేర్ ఉప్పల్, సిరినిటీ స్కూల్ కీసర విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ, డీఈవో విజయ కుమారి, జెడ్పి సీఈవో కాంతమ్మ, డి ఎం హెచ్ ఓ డాక్టర్ సి ఉమా గౌరీ, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్ పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లాగా నడిపిస్తాం: సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 14 (విజయ క్రాంతి): ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధిని జో డెద్దులామాదిరిగా నడిపిస్తామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం సలహాదా రుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవా రం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో శు క్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
వేడుకల కు సీఎం సలహాదారు (ప్రజావ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగిం చారు. గ్రామాణాభివృద్ది, అటవీ శాఖ, హౌ సింగ్, సంక్షేమ శాఖలు, సివిల్ సప్లయ్, వైద్యఆరోగ్య శాఖ, విద్యాశాఖ, అగ్నిమాపక, ఐసిడిసి శాఖలకు సంబంధించి శకటాలు తిలకించిన అనంతరం పరిశ్రమలు, గ్రామాణాభివృద్ది, వ్యవసాయం, ఉద్యానవన, పౌర సరఫరాలు, విద్యుత్ శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం తిలకించారు.
ఉత్తమ సేవలు అందించిన జిల్లా పౌర సం బంధాల అధికారిపి.సి.వెంకటేశం, కార్యాలయ సిబ్బంది అబ్దుల్ అజీజ్ (టైపిస్ట్), లియాకత్ అలీ (ఆఫీసు సబార్డినేట్), ఇతర జిల్లా అధికారులకు, ఉద్యోగులకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. పదవ తరగతి, ఇం టర్ లో అధిక మార్కులు సాధించిన వి ద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశా రు. వేడుకల సందర్భంగా చిన్నారుల సాం స్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.
ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిం చి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. కె. జి.బి.వి. స్కూల్ ఆమన్ గల్, మోడల్ స్కూల్ మహేశ్వరం, ఎ.వి.న్ ఇంటర్నేషనల్ స్కూల్, హయాత్ నగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుక్కుగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్ గుల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిధితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
వేడుకల్లో ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్ రెడ్డి, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, టీయూఎఫ్‌ఐడిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, మహేశ్వరం డిసిపి సునీతా రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ. సునీల్, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులుపాల్గొన్నారు.