11-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు/జిన్నారం, జులై 10 : గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గురువారం జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ.41 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.11 లక్షలతో పుట్టుగూడలో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని కాలనీలలో మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, గ్రామ మాజీ సర్పంచ్ శివరాజ్, వడ్డే కృష్ణ, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇక్రిసాట్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం
రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న డైమండ్ పాయింట్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రహదారి విస్తరణలో భాగంగా ఇక్రిసాట్ రైల్వే ఫెన్సింగ్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, వివిద దళిత సంఘాల ప్రతినిధులు, జాతీయ రహదారి సంస్థ అధికారులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు.