calender_icon.png 4 September, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోను ఢీకొట్టిన బైక్

22-09-2024 12:50:36 AM

వ్యక్తి మృతి

అల్లాదుర్గం(మెదక్), సెప్టెంబర్ 21: అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో 161 జాతీయ రహదారిపై ముప్పారం ఫ్లు ఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. టేక్మాల్ మండలానికి చెందిన ఖమర్ (42) బైక్‌పై రంగయ్య అనే వ్యక్తితో కలిసి పెద్దశంకరంపేటకు వెళ్లి తిరిగి టేక్మాల్ వస్తుండగా ముప్పారం వద్ద ముందు వెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఖమర్ తలకు తీవ్రగా యాలు కాగా అతన్ని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.