10-11-2025 12:49:19 AM
గాంధీనగర్, నవంబర్ 9: గుజరాత్ యాంటీ- టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. దేశమంతటా ఉగ్రవా ద దాడులకు కుట్ర పన్నుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. నిందితుల్లో హైదరాబాద్‌లోని రాజంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌తో పాటు మరో ఇద్దరు మహమ్మద్ సుహెల్, ఆజాద్ సులేమాన్ సైఫీ ఉన్నట్లు ఏటీఎస్ ప్రకటించింది.
ఆ రాష్ట్ర ఏటీసీ డీఐజీ సునీల్ జోషి తెలిపిన వివ రాల ప్రకారం.. అనుమానితులు దాదాపు ఏడాది పాటు ఏటీఎస్ నిఘాలో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మ ద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు. అతను అహ్మదాబాద్‌ను సందర్శించాలని యోచిస్తు న్నాడని సమాచారం అందిందని, దాని ఆధారంగా అతని కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు. గుజరాత్‌లోని అదాలజ్ టోల్ ప్లాజా వద్ద అడ్డగించి అతడితో పాటు ఇద్దరిని పట్టుకున్నామని వివరించారు.
వారి వద్ద నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, బెరట్టా పిస్టల్, 30 లైవ్ క్యాట్రిజ్‌లు, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్, ప్రాణాంతక రసాయనం ‘రిసిన్’ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొహియుద్దీన్ ఉగ్రవాద ప్రణాళికలో భాగంగా రిసిన్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కలోల్ సమీపంలోని నిర్జన ప్రాంతం నుంచి సయ్యద్ ఆయుధాల నిల్వను పొందాడని, అతను సేకరించిన ముడి పదార్థాలు, పరికరాలను ఉపయోగించి రసాయన బాంబ్ (రెసిన్ గ్యాస్) తయారీ చేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
ఏటీసీ అధికారులు మొహియుద్దీన్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి నవంబర్ 17 వరకు పోలీసు కస్టడీకి విధించింది. ఈ ఏడాది ప్రారంభంలో అల్ ఖైదా ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న ఐదుగురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. నిందితుల్లో బెంగళూరుకు చెందిన ఓ మహిళ సైతం ఉంది. ఆన్‌లైన్ వేదికగా ఆ మహిళ టెర్రర్ మాడ్యూల్?ను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పాక్‌లోని ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్టు తెలిపారు.
చైనాలో ఎంబీబీఎస్ పట్టా..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, చైనాలోని ఓ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. మొహియుద్దీన్‌కు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)తో సంబంధాలున్న ఆఫ్గనిస్తాన్ అబూ ఖదీజాతో పరిచయం ఏర్పడింది. మొహియుద్దీన్ అతడితో పాటు అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంభాషిస్తున్నానని అధికారుల ఎదుట అంగీకరించాడు.
అతని మొబైల్ డేటా, కాల్ రికార్డులు, స్థాన వివరాల ఆధారంగా ఏటీఎస్ అధికారులు రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీంను అరెస్ట్ చేశారు. వీరద్దరూ పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
వీరు రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ అక్రమ మార్గం ద్వారా ఆయుధాలను రవాణా చేశారని, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని సున్ని తమైన ప్రదేశాలపై రెక్కీ నిర్వహించారని దర్యాప్తులో తేలింది. భారత్‌లోకి ఆయుధాలు దిగమతి చేసేందుకు వీరు పాకిస్తాన్ సరిహద్దు మీదుగా డ్రోన్లను ఉపయోగించారని తెలిసింది. నిందితులపై ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా)తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు అబూ ఖదీజా కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత..
పహల్గామ్‌లో పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత, జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద సమీకరణ జరుగుతుందని నిఘా నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మొహమ్మద్ (జేఎం) కేంద్రపాలిత ప్రాంతం అంతటా సమన్వయంతో వరుస దాడులకు సిద్ధమవుతున్నాయని నివేదిక సూచిస్తుంది.
నిఘా వర్గాల ప్రకారం పాకిస్తాన్ ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)దాని ఎలైట్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్‌ఎస్జీ) కుట్రలకు చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి చొరబాటు మార్గాల్లో డ్రోన్ కార్యకలాపాల్లో గణనీయమైన పెరుగుదలను నిఘా సంస్థలు గమనించాయి. ఈ కార్యకలాపాలను షంషేర్ పేరుతో ఆపరేటివ్ నేతృత్వంలోని లష్కర్ ఏ తోయిబా యూనిట్‌కు నివేదిక ఆపాదించింది. ఈ డ్రోన్లు వ్యూహాత్మక కొండలు, భద్రతా స్థావరాలపై వైమానిక నిఘా నిర్వహించాయని నివేదించింది.
సరిహద్దులో ఆకస్మిక దాడులకు కుట్ర?
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో పాకిస్తాన్ సరిహద్దు యాక్షన్ బృందం (బీఏటీ) తాజాగా కదలికలు గుర్తించింది. బీఏటీలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, పదవీ విరమణ చేసిన ఎస్‌ఎస్జీ కమాండోలు ఉన్నారు. ఇస్లామాబాద్ చాలాకాలం నుంచి క్రాస్-బోర్డర్ దాడులకు ఉపయోగిస్తున్నది. రాబోయే నెలల్లో ఆకస్మిక చొరబాటు ప్రయత్నాలు లేదా సరిహద్దు ఆకస్మిక దాడుల కుట్రను సూచిస్తుందని భద్రతా అధికారులు హెచ్చరిస్తున్నారు.