10-11-2025 12:37:03 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని, ఓటమి ఖాయమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. కులాలు, మతా లకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ వైపే నియోజకవర్గ ఓటర్లంతా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా అదివారం ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల అసోసియేషన్లతో ప్రత్యేకంగా సమావేశమై, హైదరా బాద్ మహానగరాభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన సేవలను, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను ఓటర్లకు వివరించారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాంతా న్ని పూర్తిగా గాలికొదిలేశారు అని శ్రీధర్‌బాబు విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి, మొత్తం నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.
నేటికీ జూబ్లీహిల్స్‌లోని చాలా కాలనీలు, బస్తీల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు అని అన్నారు. “గత రెండేళ్లలో మా ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఇది చూసి ఓర్వలేక, తమ ఉనికిని కాపాడుకునేందుకే బీఆ ర్‌ఎస్, బీజేపీలు మాపై బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయి.
పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఈ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయి,‘ అని ఆయన ఆరోపించారు. మెరుగుపరిచేందుకు నిపుణుల మార్గనిర్దేశంలో పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్ర మంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.