calender_icon.png 10 November, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ఆర్యవైశ్య వన సమారాధన

10-11-2025 01:43:09 AM

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని చెరుకూరి వారి తోటలో ఆదివారం ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం, వన సమారాధన ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఖమ్మం నగరం నుంచే కాక ఉభయ ఖమ్మం జిల్లాలోని ఆర్యవైశ్యులు సుమారు 15 వేల మందికి పైగా హాజరై విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయం గోపూజతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం సుమారు 470 మంది జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. శాస్త్రీయ నృత్యాలు, పాటలతో ప్రతి 30 నిమిషాలకు డ్రాలు తీసి బహుమతులు అందజేశారు. వివిధ రకాలైన ఆటల నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి కన్వీన ర్‌గా చిన్ని కృష్ణరావు, ఆహ్వాన కమిటీ సభ్యు లు కల్వకుంట్ల గోపాలరావు కార్యక్రమం విజయవంతం కావడంలో కృషి చేశారు.

ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్, పాలకవర్గం గోళ్ళ రాధాకృష్ణమూర్తి, మాసెట్టి వరప్రసాద్, రాయపూడి రవికుమార్, రాయపూడి జయరాం, ఊటూరి లక్ష్మీనరసింహారావు, కూర శ్రీనివాస్, ఎడమకంటి రామారావు, గుంటుపల్లి దివాకర్ గుప్తా, పబ్బతి ప్రదీప్, కందిబండ వేణుగోపాల్  ఇతర కార్యవర్గం అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.