calender_icon.png 10 November, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వేచ్ఛ, సమానత్వం కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్

10-11-2025 01:43:36 AM

ఘట్ కేసర్, నవంబర్ 9 (విజయక్రాంతి) : స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పెంపొందించటానికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు సంజీవ్ చౌహాన్ కొనియాడారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 239వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా సంజీవ్ చౌహాన్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పెంపొందించటానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. అంబెడ్కర్ ఒక వర్గం కోసం ఆలోచించలేదని, భారతదేశంలో ఉన్న సబండ వర్గాలకోసం ఆలోచించిన వ్యక్తి అంబెడ్కర్ అన్నారు. ప్రపంచ దేశాల్లో చదివిన మేధావి అంబెడ్కర్ కి 18 డిగ్రీలు ఉన్నాయని, అంతటి మహోన్నతమైన వ్యక్తి మనకి దార్శనికుడిగా యువత ఎంచుకోవాలని ఎంచుకొని ఆయన రచనలు చదివి జ్ఞానవంతులు కావాలని పిలుపునిచ్చారు.

ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. అంబెడ్కర్ కోసం చేసే ప్రతి కార్యక్రమంలో మాసహాయ సహకారాలు అందిస్తాం అని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు నాగేష్ గుప్త, డాక్టర్ ఆర్. పురుషోత్తం నాయక్, కె. నర్సింగ్ రావు, కె. సత్యం, ముధావత్ వీరూనాయక్, ఎం. రాజేష్ కుమార్, నరేష్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, కడప రవి, సి. సుధాకర్, బి. సురేష్ గౌడ్, జి. అంజయ్య, ఎస్. కృష్ణం రాజు, తదితరులు పాల్గొన్నారు.