10-11-2025 01:44:36 AM
-టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
-వనస్థలిపురంలో కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వనభోజనాలు
ఎల్బీనగర్, నవంబర్ 9 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఏసమస్య వచ్చినా స్పందిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఆదివారం వనభోజనాలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ప్రాంతాలుగా ఏపీ, తెలంగాణ విడిపోయినప్పటికీ నగరంలో నివసించే వారందరూ స్థానికులేనని, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామని తెలిపారు. సెటిలర్స్ అనే పదం ఎవరూ వాడకూడదని, వారందరిని తోబుట్టువులా భావించి, ఏ ఆపద వచ్చినా స్పందించి పని చేస్తున్నామన్నారు.
కౌండిన్య కులస్తులు తమ కాలనీల్లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే.. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్, మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, నాయకులు ధనరాజ్ గౌడ్, అఖిల భరత గౌడ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వేములయ్య గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, బుడ్డ సత్యనారాయణ, కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని సురేశ్ గౌడ్, రాఖీ గౌడ్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కొత్త మహేశ్ గౌడ్, నరేందర్ గౌడ్, రమణా గౌడ్, బుర్ర రవీందర్ గౌడ్, న్యాయవాది భిక్షపతి గౌడ్‌పాల్గొన్నారు.