06-11-2025 01:11:20 AM
-ప్రజలతో కరచాలనం చేస్తుండగా దుండగుడి అసభ్యకర ప్రవర్తన
-సోషల్ మీడియాలో వీడియో వైరల్
మెక్సికో, నవంబర్5 : దేశాధ్యక్షురాలిపై చేదు అనుభవం ఎదురైంది. ప్రజలతో కరచాలనం చేస్తుండగా దుండగుడు ఆమెపై చేతులు వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయబోయాడు. హఠాత్పరిణామానికి తేరుకున్న ఆమె నిందితుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భద్రతా సిబ్బందికి నచ్చజెప్పారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిచోకాన్ రాష్ట్రం ఉరు ఆపాన్ పట్టణ మేయర్ కార్లోస్ రోడ్రిగెజ్ ఆఫ్ ది డెడ్ వేడుకల సమయంలో పబ్లిక్ ప్లాజాలో హత్యకు గురయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఆందోళన కారులను శాంతింపజేసేందుకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తాజాగా మిచోకాన్ రాష్ట్రంలో బహిరంగంగా పర్యటించారు.
మెక్సికో సిటీ కేంద్రంలో ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను వెనుక నుంచి పట్టుకుని ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు.ఆ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని వెనక్కి లాగారు. ఈ ఘటనపై ప్రెసిడెన్షియల్ గార్డ్ లేకపోవడం వల్ల భద్రతా లోపాలు ఉన్నాయన్న విమర్శలకు దారి తీసింది.