08-07-2025 12:00:00 AM
జూన్‌లో ఆర్థికరంగానికి బూస్ట్
ముంబై, జూలై 7: భారత ఆర్థిక వ్యవస్థ కొత్త తీరాలకు పరుగులు పెడుతోంది. జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థకు అన్ని అంశాలు కలిసొచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపొచ్చింది. తాజా తగ్గింపుతో రెపో రేటు 5.50కి చేరుకుంది. సీఆర్‌ఆర్‌ను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు. స్టాన్స్‌ను న్యూట్రల్‌కు మార్చి మార్కెట్లోకి మనీ ఫ్లోటింగ్‌ను పెంచారు.
ఇక ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటును 6.3 శాతం మేర అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల విలువ 825 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ తెలిపారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్లు భారీ ఎత్తున రావడంతో ఎక్స్‌టర్నల్ సెక్టార్ బలపడింది. భారతీయ ట్రేడ్ లోటు మే 2025లో 12.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్‌లో ఈ విలువ 18.3 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఉండేది.