calender_icon.png 21 January, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొట్టిన కారు

02-10-2024 02:27:30 AM

ఎంబీఏ విద్యార్థి మృతి

మేడ్చల్, అక్టోబర్ 1: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జాజిబ్ ఇక్బాల్  శామీర్‌పేట్‌లోని ఐపీఈ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. మంగళవారం హైటెక్ సిటీ నుంచి కళాశాలకు యాక్టివాపై వెళ్తుండగా మునీరాబాద్ సీఎంఆర్ కాలేజీ వద్ద ఔటర్ సర్వీసు రోడ్డుపై ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఇక్బాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. బొలేరో వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎస్‌హెచ్‌వో సత్య నారాయణ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.