07-01-2026 12:00:00 AM
ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఓం ప్రకాష్
తూప్రాన్, జనవరి 6 : మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి వాతావరణం నెలకొల్పన్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా చక్కటి చెట్లను పెంపకం చేస్తే కొందరు వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం గ్రామంలో భారీగా పెరిగిన హరితహారం చెట్లను ఎలాంటి పర్మిషన్లు లేకుండా నరికి వేయడం జరిగింది. దీనిపై గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఖండించారు.
ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిరంజీవి మరియు సెక్షన్ ఆఫీసర్ ఓం ప్రకాష్ లకు చెట్లు నరికిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా.. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిరంజీవి సెక్షన్ ఆఫీసర్ ఓం ప్రకాష్ చెట్లు నరికిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.