26-11-2025 12:17:57 AM
అశ్వాపురం, నవంబర్ 25 (విజయక్రాంతి): రైతులను దోపిడీ చేసే దళారీ వ్యవ స్థను పూర్తిగా నిర్మూలించడం తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అశ్వాపురం మండలంలోని నెల్లిపాక పీఎసీసీ ఆ ధ్వర్యంలో మొండికుంటలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు.
సందర్భంగా ఆయన కేంద్రంలోనీ వడ్ల నమూనాలను పరిశీలించి నాణ్యతను తనిఖీ చేశారు. తదుపరి రైతులతో పరస్పరం మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో పంట దిగుబడులు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ హా మీల అమలుపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల చెమట చుక్కల విలువ తెలిసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమ లు చేస్తూ, పినపాక నియోజకవర్గ పరిధిలో ని అన్ని పీఏసీఎస్ కేంద్రాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రభు త్వం నిర్ణయించిన మద్దతు ధరకే ప్రతి గింజ కొనుగోలు చేయటం తమ బాధ్యత అని స్ప ష్టం చేశారు. కేంద్రాల్లో ఏ విధమైన అక్రమా లు, ముఖ్యంగా తూకంలో లోపాలు జరుగుతాయన్న అనుమానం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల క ష్టాన్ని దోచుకునేందుకు ప్రయత్నించే దళారీ వ్యవస్థ ఈ ప్రభుత్వం కాలంలో నిలదొక్కుకోలేదు, ఇకపై కూడా నిలవనీయము అని తె లిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తూ పారదర్శక కొనుగోలు విధా నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కా ర్యక్రమంలో ఏడిఓ తాతారావు,ఎమ్మార్వో మణిధర్ ,సిసిల్ సప్లై అధికారి డిటి శివకుమార్ ,మానిటరింగ్ ఇంచార్జీ హనుమాన్, నెల్లిపాక పిఎసిఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య,పిఎసిఎస్ సీఈవో వెం కట్ డైరెక్టర్లు పినికేసి సుధాకర్ రెడ్డి, కోడి వెం కన్న, నరసింహ, ఎక్స్ ఎంపీపీ బేతం రామకృష్ణ , సిపిఐ నాయకులు ఎక్స్ పి ఎస్ ఎస్ చైర్మన్ కమటం వెంకన్న,ఓరుగంటి రమేష్ బాబు,
బూరెడ్డి వెంకటరెడ్డి, వీరమాచనేని రాజా, బిక్కసాని సత్యనారాయణ ,కొండాబత్తుల ఉపేందర్, తూము వీరరాఘవులు, కం దిమల్ల రామిరెడ్డి, కందాల వెంకటరెడ్డి, సిపి ఐ సీనియర్ నాయకులు మద్ది వెంకటరెడ్డి, బచ్చు వెంకటరమణ, ఆవుల రవి, మట్టా వీరభద్రారెడ్డి, సురకంటి గంగారెడ్డి , చుంచు ఏకాంబరం, మచ్చా నరసింహ రావు, రాగం మల్లయ్య తదితరులుపాల్గొన్నారు.