26-11-2025 12:17:15 AM
కరీంనగర్, నవంబరు 25 (విజయ క్రాంతి): నూతన డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ కరీంనగర్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు చేతికి దట్టి కట్టి, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.