calender_icon.png 27 August, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరగతికి ఒక టీచర్ ఉండాలి

22-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఒక తరగతికి ఒక ఉపా ధ్యాయుడే ఉండాలని యూఎస్‌పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి టీ) డిమాండ్ చేసింది. టీచర్ల సర్దుబాటుకు సంబంధించిన జీవో 25ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఆదేశించడాన్ని యూఎస్‌పీసీ తీవ్రంగా ఖండించింది. ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, అదేవిధంగా 60 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులను కేటాయించాలని పేర్కొ నడం అసంబద్ధమైన నిర్ణయమన్నా రు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్ద రు ఉపాధ్యాయులు, 40 మంది వర కు ఇద్దరు, 60 మంది వరకు ముగ్గు రు, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని చొప్పున కేటాయించాలని, ప్రతి ప్రైమరీ స్కూల్‌కు హెచ్ ఎంను నియమించాలని కోరారు.