12-12-2025 01:09:36 AM
సొంత గ్రామంలో మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : సేవా గుణం గ్రామమే నేర్పుతుందాని, అదే స్ఫూర్తితో ఎమ్మెల్యేగా, మంత్రిగా రాణించ గలిగానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నా రు. తమ అమ్మానాన్నలు జోగు బోజమ్మ- జోగు ఆశన్నల జ్ఞాపకార్థం స్వంత గ్రామం దీపాయి గూడలో పేదల కోసం కాలనీ నిర్మిం చి తీరుతానని పేర్కొన్నారు. పేదల ఇండ్ల కోసం ఇప్పటికే 6 ఎకరాల సొంత భూమిని ఇవ్వడం జరిగిందని, అవసరమైతే మరో 2,3 ఎకరాలను సైతం కొనుగోలు చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల ప్రచా రంలో బాగంగా గురువారం దీపాయి గూడ లో పెద్దఎత్తున గ్రామస్థులతో కలిసి ఆయన పర్యటించారు.
బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తో పాటు పదిమంది వార్డు సభ్యుల ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ... ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న విధంగా తాను మంత్రి పదవి స్థాయికి ఎదిగిన, పుట్టిన స్వగ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
దళిత బస్తీ కింద ఎన్నో ఎకరాల భూమిని పేద దళితులకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందించాలని ప్రైమరీ స్కూ తో పాటు హైస్కూల్ హలో మౌలిక వసతులు కృషి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మౌనిష, నితిన్ రెడ్డి, బొల్లి గంగన్న, కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి అశోక్, దేవర్తి గణేష్, దోర్ల సంతోష్ జోష్ణ తదితరులు పాల్గొన్నారు.