calender_icon.png 17 December, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాడ్‌తో కొట్టి చంపేశారు!

17-12-2025 01:40:00 AM

  1. లారీ డ్రైవర్ల మధ్య గొడవే కారణం
  2. యూపీకి చెందిన సల్మాన్ మృతి
  3. పరారైన నిందితులు
  4. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘటన

బాన్సువాడ, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య గొడవ.. ఒకరి ప్రాణాలను బలిగొన్నది. నిజామాబా ద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవితండా సమీపంలో జాతీయ రహ దారిపై ఓ దాబా వద్ద మంగళవారం సా యంత్రం ఉత్తరప్రదేశ్ ఇలహాబాద్‌కు చెంది న డ్రైవర్ మహమ్మద్ సల్మాన్(48) లారీ నిలిపాడు. మరో లారీలో వచ్చిన ఇద్దరు డ్రైవర్లు కూడా తమ లారీని అక్కడే ఆపినట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే అక్కడ డ్రైవర్ల మ ధ్య గొడవ జరగడంతో సల్మాన్‌పై రాడ్‌తో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందిన ట్లు సమాచారం. నిందితులు చంద్రాయన్‌పల్లి వద్ద లారీని వదిలి పరారైనట్టు తెలిసిం ది. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు.