17-12-2025 12:45:58 AM
భయాందోళనలో ప్రజలు
కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): దోమకొండ మండలంలోని అంబారిపేట శివారులో దూడలపై పెద్దపులి దాడి చేసినట్లు అక్కడి రైతులు పేర్కొన్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి డబుల్ బెడ్ రూం సముదాయం నుంచి మాందాపూర్ వెళ్లేదారిలో ఆకుతోట రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో మరోమారు పులి సంచారం ఆందోళనకు గురిచేసింది. సోమవారం రాత్రి ఓ ఆవుపై దాడి చేసి చంపేసినట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ పెద్దపులి సంచరించిన ప్రాంతంలో ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో పెద్దపులి కదలికలు రికార్డు అయినట్లు తెలుస్తోంది.