calender_icon.png 17 December, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది పల్లె పోరుకు సర్వం సిద్ధం..

17-12-2025 12:43:35 AM

  1. నేడే మూడవ విడత పంచాయతీ ఎన్నికలు.. 
  2. పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలిన సిబ్బంది....
  3. ఏర్పాట్లను పరిశీలించిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు
  4. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని అధికారుల పిలుపు

ఆదిలాబాద్/కుబీర్, తానూర్/నిర్మల్/భైంసా/కుమ్రం భీం ఆసిఫాబాద్/ మంచిర్యాల, డిసెంబర్ 1౬ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుది పల్లె పోరుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే మొదటి, రెండవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియగా, 3వ విడత ఎన్నికలను సైతం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 

తలమడుగు, బజారత్నూర్, గుడిహత్నూర్, సోనాల, బోథ్, నేరేడిగొండ మండలాల్లో చివరి విడత ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం ఆయా మండలాల వారీగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బంది సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లా రు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించగా...

అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుం చి ఓట్ల లెక్కింపు చేపట్టాగా, సాయంత్రం వరకు ఫలితాలను వెలువడనున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జిల్లాలో మూడో విడతలో 151 పంచాయతీలకు,  1,220 వార్డు సభ్యులకు గాను పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి రెండు విడతల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగగా.. చివరి విడత లోనూ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజర్షి షా పలు మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించి, ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రశాంతత కోసం పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పోలింగ్ కేం ద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు చేయనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగే 6 మండలాలలో 37 క్లస్టర్లు, 25 రూట్‌లతో, 151 గ్రామాలలో 204 పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

సరిహద్దు గ్రామాలపై పోలీసుల నిఘా

కుబీర్ తాండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల పరిశీల కురాలు అయేషా ముష్రత్ కణం తెలిపారు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. తానూర్ కుబీర్ మండలాలు మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడంతో ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

కుబీర్ మండలంలో 42 తాండూరు మండలంలో 32 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి అని ఉదయం ఏడు గంటల నుంచి ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించి తర్వాత ఫలితాలను ప్రకటిస్తామన్నారు విధులుండగా మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది మంగళవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాగర్ రెడ్డి అధికారులు ఉన్నారు.

సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ అభిలాష 

నిర్మల్ జిల్లాలో తుది దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికి రెండు విడుదలుగా గ్రామపంచాయతీ ఎన్నికలను సక్సెస్ చేసిన జిల్లా యంత్రాంగం మూడో విడత ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించి ఫలితాలను ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటును పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

ముధో ల్ నియోజకవర్గం నియోజకవర్గంలోని 133 జిపి లగ్గాను 9 జీపీలు ఏకగ్రీవంగా 124 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాడల్లో 11 26 జీపీలకు గాను 33 వార్డులు ఏకగ్రీవం కా గా 793 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. భైంసా డివిజన్లోని బైంసాలో 30 జీపీలు ముధోల్‌లో 19 జీపీలు తానూరులో 32 జీపీ లు బాసరలో పది జీపీలు కుబీర్ లో 42 జిబి లకు ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ ఎన్నికలన్నీ మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో జిల్లా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వశిష్టమైన ఏర్పాటలు పూర్తిచేసింది.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి రెండు గంటల తర్వాత కోట్ల లెక్కింపును ప్రారంభించి జిపి ల ఆధ్వర్యంలో ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ముధోల్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బాసర కుబీర్ తానూర్ తదితర మండలాల్లో ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర త ఉత్కంఠ నెలకొంది. మొత్తం ఓటర్లు 1,50,593 ఉండగా అందులో 73,085 పురుషులు 77,502 స్త్రీ ఓటర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు

గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

ముధోల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ప్రత్యేక బస్సులు పోలింగ్ సామాగ్రిత్తో గ్రామాలకు తరలి వెళ్లారు. పిఓలు అసిస్టెంట్ పి వోలు రూటు పరిశీలకులు పోలీస్ సిబ్బంది

ఇతర సిబ్బంది తో గ్రామాలకు చేరుకొని ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటును సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల నేతలు పార్టీ మద్దతుదారులు సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులు గెలిపే లక్ష్యంగా ఆయా గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రలోభం పెట్టి తాయిలాలు ప్రకటిస్తున్నారు

ఓటు హక్కును వినియోగించుకోవాలి

బైంసా సబ్ డివిజన్లోని ఆయా మండలా ల్లో బుధవారం నిర్వహించి గ్రామపంచా యతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. ఓటర్లు ఏదేని గుర్తింపు కార్డుతో ఎన్నికల పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వేసుకోవాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పూర్తి స్థాయిలో ఏర్పాట్లు.. 

సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తుది విడత ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తుది విడతలో ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్ మండలాల పరిధిలోని 108 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు  2 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 2 పంచాయతీలలో నామినేషన్లు దాఖలు కాలేదు దీంతో 104 సర్పంచ్ స్థానాలకు, 938 వార్డు సభ్యుల స్థానాలకు  186 స్థానాలు ఏకగ్రీవం అయ్యా యి. 8 స్థానాలకు నామినేషన్లు దాఖలుకాకపోవడంతో 744 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక లు జరగనున్నాయి.

3వ విడత ఎన్నికల్లో 61,252 మంది పురుషులు, 61,141 మంది మహిళలు, 6 మంది ఇతరులు కలిపి మొత్తం 1,22,429 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా 1,079 మంది పోలింగ్ అధికారులు, 1,241 మంది ఇతర సిబ్బందికి విధులు కేటాయించారు. నాలుగు మండలాల్లో ఎన్నిక లు ప్రశాంతంగా జరిగేందుకు 27 మంది జోనల్ అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.  పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు..

జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3వ విడత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలను పారదర్శకంగా,

శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు .మొదటి, రెండో విడతల మాదిరిగానే తుది విడత ఎన్నికలు కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహిం చాలని ఆయన సూచించారు.జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో ఎన్నికల నేపథ్యంలో బాంబ్,డాగ్ స్క్వాడ్ బృందాలు సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతుంది.

అధికారుల సమన్వయంతో పనిచేయాలి: కుమార్ దీపక్

రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న మూడవ విడత ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం తెలిపారు. మొదటి, రెండు విడతల ఎన్నికలను అధికారుల సమన్వయంతో జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించామని, ఈ క్రమంలో మూడవ విడత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నామని, ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుందన్నారు. మూడవ విడత ఎన్నికలలో భాగంగా జిల్లాలోని చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోనీ గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.

ఇందులో 102 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 390 నామినేషన్లు వచ్చాయని, 4 స్థానాలు ఏకగ్రీవం కాగా 98 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. 868 వార్డు సభ్యుల స్థానాలకుగాను 1,905 నామినేషన్లు వచ్చాయని, 4 స్థానాలలో నామినేషన్లు రాకపోవడం, సరైన నామినేషన్లు సమర్పించకపోవడం మినహాయించి 153 స్థానాలు ఏకగ్రీవం కాగా 711 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

ఈ ఎన్నికలలో 52,810 మంది పురుషులు, 54,075 మంది మహిళలు, నలుగురు ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించామన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా, నిస్పక్షపాతంగా వినియోగించుకో వాలని తెలిపారు.

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చర్యలు

ముధోల్ నియోజకవర్గం బుధవా రం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎన్నికల నియమాలని కచ్చితంగా పాటించాలని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్మించుకునేందుకు బైంసా ఎస్పీ రాజేష్ మీనా ఆదరణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీలు తీసుకోవద్దని సూచించారు.