calender_icon.png 4 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వకర్మలు రాజకీయ చైతన్యంతో ముందుకెళ్లాలి

04-08-2025 12:03:15 AM

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ.చిరంజీవులు

ముషీరాబాద్,(విజయక్రాంతి): విశ్వకర్మ కులస్తులు రాజకీయ చైతన్యం తెచ్చుకొని బీసీల రాజ్యాధికారం ముందుకు వెళ్ళాలని బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు (ఐఏఎస్) పిలుపునిచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అధినేత విశ్వనాధుల పుష్పగిరి 450 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టి. చిరంజీవులు మాట్లాడుతూ ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా ఉన్న విశ్వకర్మలు ఇతర బీసీ కులాలు యాత్రికరణ గ్లోబలైజేషన్ ఫలితంగా వృత్తుల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విశ్వకర్మలు ఇప్పటికి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉండాలని చట్టసభల్లో లేనందునే విశ్వకర్మల అభివృద్ధి అభివృద్ధిలో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక శాతం జనాభా ఉన్న అగ్రకులాల వద్ద అధిక శాతం సంపద పోగు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి బీసీలు దూరమయ్యారని  ఆవేదన వ్యక్తం చేశారు. చందర్ విశ్వకర్మ జాగృతి కోసం పుష్పగిరి చేసిన సుదీర్ఘ పాదయాత్రతో జాతి చైతన్యవంతం అవుతుందని, రాజకీయ చైతన్యం వచ్చే దిశగా ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి విశ్వకర్మలు ముందుండి పోరాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ.... తెలంగాణ, రాయలసీమలో విశ్వకర్మల పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని త్వరలో రాజకీయ చైతన్యం రాజకీయ నాయకత్వం పెంపొందించడమే లక్ష్యంగా తన పాదయాత్ర సాగింది అని చెప్పారు. చామకూర రాజు మాట్లాడుతూ బీసీలు సంఘటితంగా రాజకీయ అధికార కోసం అనేక రూపాలలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశ్వనాథుల పుష్పగిరిని చిరంజీవిలతో పాటు సభకు హాజరైన వారందరూ కలిసి ఘనంగా సన్మానించారు. కె.వి గౌడ్ బత్తుల సిద్దేశ్వరులు పటేల్, డాక్టర్ అవ్వారువేణు కుమార్ అంబాల నారాయణ గౌడ్, ఐలి వెంకన్నగౌడ్, కొండపల్లి రజిత లక్ష్మణ్, ముత్యాల సదాశివ, రమేష్ యాదవ్ లింగేష్ యాదవ్, సుమంత్, లక్షణ్, రజిత, పర్వతం వాని, ఇటికల సదాశివ, శ్రీమాన్, విష్ణు వర్ధన్, కొంగర నరహరి తదితరులు పాల్గొన్నారు.